కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోవాలి: గవర్నర్ తమిళి సై

Sankranthi-Festival-in-Raj-bhavan

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో గవర్నర్ తమిళి సై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ.. సంక్రాంతి పండగను పురస్కరించుకొని రైతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ప్రకృతి పండగన్న గవర్నర్.. మాస్క్ దరించి భౌతిక దూరం పాటిస్తూ పండగ జరుపుకోవాన్నారు.

ప్రతి ఒక్కరు వాక్సినేషన్ వేయించుకోవాలి. మొదటి డోస్ 100 శాతం పూర్తయింది. రెండో డోస్ తీసుకొని వారు తీసుకోవాలి. కరోనా ఫ్రీ, ఒమి క్రాన్ ఫ్రీ, డెల్టా ఫ్రీ దేశం కావాలని ఈ సందర్భంగా గవర్నర్ కోరుకున్నారు.