ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో 33 మంది వైద్య సిబ్బందికి కరోనా

Government Chest Hospital

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. తాజాగా 4,393 కరోనా కేసులు కొత్తగా నమోదు అయ్యాయి.

సామాన్య జనంతో పాటు డాక్టర్లు సైతం మూడో వేవ్ లోమహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో 33 మంది డాక్టర్లు, సిబ్బందికి వైరస్‌ సోకింది.

దవాఖానలోని 17 మంది పీజీ డాక్టర్లు,  ఆరుగురు సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరితోపాటు ఎనిమిది మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్‌టీ డాక్టర్లు కరోనా బారిన పడ్డారు.