దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు నమోదు - TNews Telugu

దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు నమోదుCoronavirus India LIVE Updates: India Records 18,132 Fresh Covid Cases In A Day

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కొత్త కేసులు, క్రియాశీల కేసుల సంఖ్య ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,132 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 193 మంది మరణించారు. మరో 21,563 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607కు చేరింది. ఇందులో 3,32,93,478 కరోనా నుంచి బయటపడగా, 2,27,347 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 4,50,782 మంది మహమ్మారి వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 95,19,84,373 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 10,35,797 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 58,36,31,490 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.