ఈ కరోనా లెక్కల గురించి తెలుసా?

 

ఇప్పుడు భూమి మీద ఎన్ని కరోనా వైరస్ కణాలున్నాయో తెలుసా? అవన్నీ కలిపి ఒకచోట ఉంచితే ఎంత సైజులో ఉంటాయో తెలుసా? అసలు ఇలాంటి లెక్కలు వేయాలని ఎప్పుడైనా అనిపించిందా.. అంత పెద్ద లెక్కలు మనం వేయలేము గానీ ఓ మ్యాథ్స్ సైంటిస్ట్ కిట్ యేల్స్ వేసిన లెక్కలు ఓ సారి చూద్దాం.
ప్రపంచంలోని కరోనా వైరస్ కణాలన్నిటీని ఓ దగ్గరకు చేరిస్తే అవి ఎంత సైజును అక్రమిస్తాయి? అని మ్యాథ్స్ సైంటిస్ట్ కిట్ యేల్స్ కు ఓ డౌట్ వచ్చింది. ఎలాగూ మ్యాథ్స్ తెలిసిన వ్యక్తి కాబట్టి వెంటనే లెక్కలు వేశాడు. ఇప్పటివరకూ ఎన్ని వైరస్ లు ఉన్నాయి. వాటి సైజు ఎంత.. వాటన్నింటిని కలిపితే ఎంతసైజులో సరిపోతాయి. ఇలా అన్నిక్యాలిక్యులేషన్స్ వేసుకుని ఓ రిజల్ట్ సాధించాడు.
ప్రపంచంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న కరోనా వైరస్ కణాలు మొత్తం ఓ దగ్గరకు చేరిస్తే.. అవి ఒక కోక్ టిన్ లో సరిపోతాయట. అంటే అర్థం అయిందా.. కంటికి కనిపించని వైరస్ ఎంత చిన్నగా ఉంటుందో.. “పోయిన ప్రాణాలు, చిన్నాభిన్నమైన జీవితాలు..గత ఏడాదిలో మనం అనుభవించిన కష్టనష్టాలన్నిటికీ ఈ చిన్న జీవి కారణమని తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది” అని కిట్ అంటున్నారు. తన లెక్కల ప్రకారం.. ప్రపంచంలో ఒక సెకనుకి దాదాపు 2,000,000,000,000,000,000 వైరస్ కణాలు ఉనికిలో ఉంటాయని కిట్ చెప్తున్నారు. ఇవీ కరోనా లెక్కలు.