ఉద్యోగుల ఇళ్లలో సీసీ కెమెరాలు పెడుతానంటున్న కంపెనీ.. మండిపడుతున్న ఎంప్లాయిస్

corporate company makes decision to fix cc cameras in Employees house
corporate company makes decision to fix cc cameras in Employees house

కరోనా వ్యాప్తి నివారణకు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగులు ఇంట్లోనే ఉంటూ పని చేస్తున్నారు. ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే వారి పనితీరు, ప్రవర్తన, పని పట్ల డెడికేషన్ తెలుసుకోవడం కోసం ఉద్యోగుల ఇళ్లలో సీసీ కెమెరాలు అమర్చేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఫీసులో అయితే వారు ఏం చేస్తున్నారు? ఎలా పని చేస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయవచ్చు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లో అయితే అది కుదరదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయట కొన్ని కార్పోరేట్ కంపెనీలు. అయితే.. కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు మండి పడుతున్నారు. మా ఇంట్లో కంపెనీ సీసీ కెమెరాలు అమరిస్తే మా ప్రైవసీ దెబ్బ తింటుంది కదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

corporate company makes decision to fix cc cameras in Employees house
corporate company makes decision to fix cc cameras in Employees house

ఓ అంతర్జాతీయ స్థాయి కాల్‌ సెంటర్‌ కంపెనీలో దాదాపు 4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలా మంది ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఉద్యోగుల పనితీరు తెలుసుకోవడం కోసం ఆ కంపెనీ.. వారి ఇళ్లలో కృత్రిమమేథతో కూడిన సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇళ్లలో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులపై ఒత్తిడి చేస్తోంది. సీసీటీవీ ఫుటేజీలను ఉద్యోగి కుటుంబసభ్యుల ద్వారా సేకరించి వారి పనితీరును పరిశీలించనుందట. ఆ కంపెనీ నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ‘‘ఇంట్లో ఉద్యోగి ఏం చేస్తున్నాడని గమనించడం మంచి ఆలోచన కాదు. నేను మా ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఉండి పనిచేస్తా.. అలాంటప్పుడు బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టాలంటారా? అది ఎంత వరకు సబబు? నేను మాత్రం ఈ నిర్ణయాన్ని అంగీకరించను’ అని ఓ ఉద్యోగిని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ విధానంపై పలు సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల ఇంట్లో సీసీటీవీ కెమెరా అంశంపై చర్చలు మొదలయ్యాయి.