వరంగల్ లో నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు

currency-notes

వరంగల్: నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వరంగల్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణిపై విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పీఎస్ పరిధిలోని పెద్దమ్మగడ్డ వద్ద టాస్క్ ఫోర్స్ బృందం, హన్మకొండ పోలీసులతో కలిసి దాడి చేసి 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేసిన పోలీసులు..  వారి వద్దనుంచి ఇతియోస్ కార్, నకిలీ కరెన్సీ 7,54,000లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.