చిట్టీల పేరుతో 5.5 కోట్ల మోసం.. దంపతులు అరెస్ట్

హైద‌రాబాద్ : చిట్టీల పేరుతో అమాయ‌క ప్ర‌జ‌ల‌ను 5.5 కోట్ల రూపాయల మోసం చేసిన దంప‌తుల‌ను హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని అలియాబాద్‌కు చెందిన మ‌ధు, దివ్య దంపతులు.. గ‌త ఆరేండ్ల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. గ‌తేడాది చిట్టీ కాలం పూర్త‌యిన త‌ర్వాత కూడా డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌కపోవడంతో 70 మంది బాధితులు శాలిబండ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.