రాజ్ కుంద్రాకు నో బెయిల్..హైకోర్టును ఆశ్రయిస్తామన్న కుంద్రా లాయర్

 

పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కుంద్రా కు ముంబై కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కుంద్రా బయటికి వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందన్న క్రైమ్ బ్రాంచ్ అధికారుల వాదనతో కోర్టు ఏకీభవించింది. అతని బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. మరో 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అటు కుంద్రా కస్టడీ మంగళవారంతో ముగిసింది. రాజ్ కంద్రా తరఫున లాయర్ బెయిల్ కోసం రేపు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే కుంద్రాను విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. మార్చిలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కుంద్రా ముందే ఊహించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తను ఇటీవలే ఫోన్ మార్చాడంట. జనవరి లో ఓ అశ్లీల వీడియో షూట్ కు సంబంధించి పోలీసులు ఓ ముఠా ను అరెస్ట్ చేశారు. ఆ తీగ లాగితే రాజ్ కుంద్రా డొంకంతా బయటపడింది. అప్పటి నుంచి తనను అరెస్ట్ చేస్తారని కుంద్రా అలర్ట్ అయ్యారని పోలీసులు చెబుతున్నారు.

అకౌంట్స్ పరిశీలించేందుకు అధికారి

అటు పోలీసులు కుంద్రా ఆర్థిక లావాదేవీల పైన దృష్టి పెట్టారు. కొన్ని నెలలుగా అతని బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్స్ ను పరిశీలించేందుకు ఓ ఇండిపెండెంట్ ఆడిటర్ ను కూడా నియమించారు. శిల్పాశెట్టి కి వీటితో ఏమైనా సంబంధం ఉందా అన్న దానిపై విచారణ చేపట్టారు. అందులో భాగంగానే ఆమె బ్యాంక్ అకౌంట్స్ ను కూడా పరిశీలించనున్నారు.

హాట్ షాట్స్ కాకపోతే బాలీఫేమ్

అటు రాజ్ కుంద్రా పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. హాట్ షాట్స్ అనే యాప్ ను గూగుల్, యాపిల్ స్టోర్స్ నుంచి తీసేయటంతో అప్పటికే ప్లాన్ బీ లో భాగంగా రెడీ చేసుకున్న బాలీఫేమ్ అనే యాప్ లో అడల్ట్ కంటెంట్ వీడియోలను అప్ లోడ్ చేసేవాడంట. ఓ ఇంటెలిజెన్స్ అధికారి భార్య పేరుతో ఈ యాప్ ను రిజిస్టర్ చేయించారు. ఐతే సినిమాల కోసమని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ అధికారిని ఒప్పించారంట. హాట్ షాట్ యాప్ ను ప్లే సోర్ల నుంచి తీసేయటంతో  ఆ తర్వాత బాలీఫేమ్ యాప్ లో అడల్ట్ కంటెంట్ అప్ లోడ్ చేశారు. దీనిపై ఆ ఇంటెలిజెన్స్ అధికారి అభ్యంతరం తెలిపినప్పటికీ పట్టించుకోలేదు. ఇటీవల కుంద్రా అరెస్టైనప్పటికీ నుంచి ఆయన సంస్థకు చెందిన వ్యక్తులు ఆ యాప్ నుంచి పోర్న్ కంటెంట్ వీడియోలను తీసేయాలని ఉద్యోగులను కోరారంట. ఈ విషయాన్ని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన కుంద్రా కంపెనీకి చెందిన ఉద్యోగులే చెప్పారంట.