డ్రగ్స్ కేసులో బెయిల్ తిరస్కరణ.. కస్టడీకి షారుఖ్ కొడుకు.. కన్నీరు పెట్టుకున్న ఆర్యన్

Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody
Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody
Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody
Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody

క్రూయిజ్ షిప్ పార్టీ కేసులో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఆర్యన్ ప్రస్తుతం నార్కోటిక్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ నెల 7 వరకు ఆర్యన్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు. ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఆర్యన్ ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్యన్ తో పాటు.. అర్బాజ్ సేత్ మర్చంట్, మున్ మున్ ధమేచాలను కూడా ఎన్సీబీ అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉంచనుంది. డ్రగ్స వాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ఎన్సీబీ కస్టడీలో ఉండాలని జడ్జి ఆదేశించడంతో ఆర్యన్ కన్నీరు పెట్టుకున్నాడు.

Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody
Court Sents Sharukh Khan Son Aryan Khan In NCB Custody

ఆదివారం నాడు క్రూయిజ్ షిప్ లో వెళ్లిన కొంతమంది యువకులు వారు వేసుకున్న దుస్తులు, అండర్ వేర్స్, పర్సుల్లో డ్రగ్స్ దాచి తీసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ముంబై నుంచి గోవా వెళ్తున్న షిప్పులోకి మారు వేషాల్లో వెళ్లిన ఎన్సీబీ పోలీసులు క్రూయిజ్ షిప్పులో డ్రగ్స్ తీసుకుంటున్న వారిని అరెస్ట్ చేశారు. వారిలో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఏడుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. షిప్ ముంబై నుంచి బయల్దేరిన తర్వాత అందరూ కలిసి పార్టీ స్టార్ట్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పార్టీలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల ఎండీని ఎన్సీబీ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కొనడం, దగ్గర ఉంచుకోవడం, నిషేధిత ఉత్ప్రేకరాలను వాడటం వంటి కేసులు ఆర్యన్ పై నమోదు చేశారు.