2-18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌.. కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌ - TNews Telugu

2-18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్‌.. కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌Covaxin gets emergency use approval for kids aged 2-18 years

దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్న వేళ కేంద్రం మంగళవారం మరో వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. అయితే తొలిసారిగా 2-18 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ మంగ‌ళ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ రూపొందించిన ఈ చిన్నారుల వ్యాక్సిన్ ను కరోనాపై పనిచేస్తున్న నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్ప‌టికే 18 ఏళ్ల వ‌య‌సులోపు పిల్ల‌ల‌పై భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్‌ రెండు, మూడో ద‌శ‌ల ట్ర‌య‌ల్స్ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి డేటాను ఇప్ప‌టికే డ్ర‌గ్స్ అండ్ కంప్ట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి స‌మ‌ర్పించింది. మ‌రోవైపు కొవాగ్జిన్‌కు డ‌బ్ల్యూహెచ్‌వో త్వ‌రలోనే అత్య‌వస‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే.