బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు

Covaxin, Covishield

కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులు లభించాయి. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నిర్ణయం తీసుకున్నది.

కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని ఈనెల 9న ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

త్వరలోనే టీకాల ధరలను ఆయా ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి. మెడికల్ స్టోర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఈ సందర్భంగా ఉండవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఆసుపత్రులు, క్లినిక్‌లు వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది.  టీకా డేటా ప్రతి ఆరు నెలలకు డీసీజీఐకి సమర్పించాల్సి ఉంటుందని, కో-విన్ యాప్‌లో కూడా డేటా అప్‌డేట్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.