స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలపై తెలంగాణ సీఎస్, డీజీపీల సమీక్ష

cs somesh kumar review meeting on swatantra bharat vajrotsavam celebrations

ఈనెల 8 వతేదీ నుండి 22 వ తేదీ వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలు,15వ తేదీన గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవాల నిర్వహణపై నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లతో కలసి పలు సమావేశాలు నిర్వహించి సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 8 వ తేదీన హైదరాబాద్ హెచ్ఐసీసీ లో జరిగే ప్రారంభ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపిపి లు, జెడ్పి టీసీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఈనెల 9 వతేదీ నుండి 21 తేదీ వరకు అన్ని జిల్లాల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి. ఈ ఉత్సవాలలో ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల ప్రజలను భాగస్వామ్యం చేయాలి.

ఇక రాష్ట్రంలోని ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి వీలుగా కోటి 20 లక్షల జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణి చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్లను విధ్యుత్ దీపాలతో అలంకరిస్తున్నాం. అన్ని పాఠశాలలు, గ్రామాలు, మండలాలలో పెద్ద ఎత్తున హరిత హారం నిర్వహణ. అన్ని ఆసుపత్రుల్లో పండ్ల పంపిణి. రక్తదానాల నిర్వహణ, ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, ఉద్యోగులను గుర్తించి తగు విధంగా సత్కరించడం, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, శాంతి కుమారి, అరవింద్ కుమార్, సునీల్ శర్మ, అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, అడిషనల్ డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి లతోపాటు పలువురు కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.