సీటు కింద దాచిన ప్లాస్టిక్ కవర్ లో బంగారపు ముద్ద.. స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

Customs officials seize gold smuggled at Shamshabad International Airport

హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో ఓ ప్రయాణికుని వద్ద బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గౌహతి నుండి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద 472.8 గ్రాముల బంగారం పట్టుబడింది. సదరు వ్యక్తి పేస్ట్ రూపంలో బంగారం తరలించేందుకు యత్నించాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు విమానం లో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు.. ఓ సీటు కింద ప్లాస్టిక్ కవర్ లో ముద్దగా మార్చిన బంగారాన్ని సీజ్ చేశారు. విమానం లో ప్రయాణించిన ప్రయాణీకుల వివరాలు సేకరించి… బంగారం దొరికిన సీటు లో ఎవరు కూర్చున్నారు అనే సమాచారాన్ని రాబడుతున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.23.33 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.