మా ఎన్నికల్లో ట్విస్ట్.. తెలంగాణ వాదంతో పోటీకి దిగిన సివిఎల్.. పోటీ నుండి నిష్క్రమణ..!

CVL Narasimha Rao withdraws nomination for MAA polls
CVL Narasimha Rao withdraws nomination for MAA polls
CVL Narasimha Rao withdraws nomination for MAA polls
CVL Narasimha Rao withdraws nomination for MAA polls

రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న మూవీ ఆర్టిస్ట్ ఎలెక్షన్స్ లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నికల తేదీ దెగ్గరపడుతున్న కొద్దీ పోటీ నుండి వరుసగా తప్పుకుంటున్న సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మొన్న జీవిత రాజా శేఖర్,హేమలు అధ్యక్ష బరిలో నుండి తప్పుకుని ప్రకాష్ రాజ్ కి మద్దత్తుగా నిలిచారు. వీరి ఎంట్రీతో బండ్ల గణేష్ ఎగ్జిట్ అయిపోయి ఇండిపెడెంట్ గా పోటీచేస్తానని ప్రగల్బాలు పలికి.. తిరిగి ప్రకాష్ రాజ్ గూటికే చేరాడు.ఈ ముగ్గురి ఎపిసోడ్ తరువాత మా ఎలెక్షన్స్ లో లేటెస్ట్ గా భారీ ట్విస్ట్ వచ్చిపడింది. కొద్ది సేపటి క్రితం తన మేనిఫెస్టో ప్రకటించి మరి పోటీకి సై అన్న సీవీఎల్ నరసింహారావు తాజాగా అధ్యక్ష బరి నుండి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు.

‘మా’ ఎన్నిక‌ల్లో తెలంగాణ వాదంతో సి.వి.ఎల్‌.న‌ర‌సింహ‌రావు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ వాదంతో వ‌చ్చిన ఈయ‌నకి సీనియ‌ర్ న‌టి, రాజకీయ నాయ‌కురాలు విజ‌య‌శాంతి కూడా ట్విట్టర్ ద్వారా మద్దతు తెలిపింది. కానీ ఒక ప్రత్యేక కారణంతో నామినేషన్ ని ఉపసంహరించుకుంటున్నట్టు సి.వి.ఎల్‌ ప్రకటించాడు. ‘మా’లో పోటీ చేస్తున్న ఏ సభ్యుడికి తన మద్దతు ఉండబోదని.. తానూ పోటీ నుండి తప్పుకున్న కారణాలు మరో రెండు రోజుల్లో వివరిస్తానని చెప్పారు సీవీఎల్. అయితే సి.వి.ఎల్‌.న‌ర‌సింహ‌రావు తప్పుకోవడంతో అక్టోబర్ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్య‌క్ష బ‌రిలో ప్ర‌కాశ్‌రాజ్,మంచు విష్ణు మధ్యే పోటీ నెలకొంది.