స్టాక్ మార్కెట్ లో లాభాల పేరిట 10 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

crimecyber

స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికి ఓ వ్యక్తి దగ్గర సైబర్  నేరగాళ్లు రూ.10లక్షలు దండుకున్నారు. స్నేహితుడి ఒత్తిడి మేరకు దిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఎం.టి.ఎఫ్.ఎస్ ట్రేడర్స్ లో గాంధీ నగర్ కు చెందిన సీతారామరాజు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు.

ఒక్క సారి లాభం రావడంతో రెండోసారి బాధితుడు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. డబ్బుల కోసం ఫోన్ చేయడంతో… ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. మోసపోయినని తెలుసుకున్న బాధితుడు సీతారామరాజు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ బిల్లు పేరుతో రూ.మూడు లక్షలు మోసం

విద్యుత్ బిల్లు పేరుతో ఓ విశ్రాంత ప్రభుత్వ మహిళా ఉద్యోగి దగ్గర సైబర్ చీటర్స్ మూడు లక్షల రూపాయలు దండుకున్నారు. విద్యుత్ బిల్లు పెండింగ్ లో ఉందని మహిళకు మెసేజ్ పెట్టిన నేరగాళ్లు. మెసేజ్ పెట్టిన నెంబర్ ఫోన్ చేయగా… టి.ఎస్.ఎస్.పి.డి ఎల్.సి క్విక్ సపోర్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని మహిళకు చీటర్స్ సూచించారు. యాప్ డౌన్ లోడ్ చేసుకొని డెబిట్ కార్డు నెంబర్, ఓటిపి పెట్టడంతో సైబర్ నేరగాళ్లు.. రూ.మూడు లక్షలు కాజేశారు. అంబర్ పేట్ కు చెందిన బాధిత మహిళ కల్యాణి బాలసుబ్రహ్మణ్యం మోసపోయానని తెలుసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశ్రాంత మహిళ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.