ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ తో లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులు

ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ తో సైబర్ క్రైమ్ నేరస్థులు లక్షల రూపాయిలు కాజేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ నందా కుమార్ కు ఫేస్ బూక్ లో  మారియా అలెగ్జాండర్ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సదరు వ్యక్తి రిక్వెస్ట్ ను  నందకుమార్ యాక్సెప్ట్ చేసిండు. ఆపై వాట్సాప్ నెంబర్ తో చాటింగ్ మొదలైంది.

సైబర్ నేరగాళ్లు డా.నందా కుమార్ కి  ఫ్రెండ్ షిప్ కి గుర్తుగా కొని బహుమతులు పంపిస్తానని బురిడీ కొట్టించారు. ఐఫోన్, షూస్, యూ ఎస్ డాలర్స్ పేరుతో వల వేశారు. ఈ నెల 4న ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్ గా నంద కుమార్ కు గిఫ్ట్స్ పార్సెల్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ చేసిండ్రు.

పార్సెల్ ఛార్జీలు పేరిట నంద కుమార్ రూ.35,500 సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు ట్రాన్స పర్ చేసిండు. మరుసటి రోజు ల్యాండింగ్ ఛార్జెస్, ప్రొసెస్సింగ్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ కిందట మొత్తం రూ.24 లక్షలు విడుతలుగా నగదు ట్రాన్స్ పర్ చేయించుకున్నారు. తీరా చేతులు కాలాక మోసపోయానని గ్రహించిన నందకుమార్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు..  దర్యాప్తు మొదలుపెట్టారు.