తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. జీవో జారీ

DA increase for government employees in Telangana .. Jivo issued

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త తెలిపింది. ఉద్యోగుల డీఏ పెంచుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల డీఏ 10.01 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జులై 1 నాటికి పెరిగిన డీఏ వర్తించనుంది. ఈ నెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ కూడా ఉద్యోగులు అందుకోనున్నారు. 2021 జూలై నుంచి ఉన్న బకాయిలను ప్రభుత్వం.. జీపీఎఫ్‌లో జమ చేయనుంది. కాగా డీఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.