హుజురాబాద్‌లో ఆగనున్న దళితబంధు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లేఖ

హుజురాబాద్‌ పరిధిలో దళితబంధు పథకం అమలు తాత్కాలికంగా ఆగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పథకం అమలును ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ) కు రాసిన లేఖలో సూచించింది.

Dalit-Bandhu-scheme

ఈ నెల 30న హుజూరాబాద్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు దళితబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.