ఈటల రాజేందర్.. తెలంగాణ ఉద్యమం కారణంగా గెలిచావని మర్చిపోతున్నావ్

dasari bhumaiah Comments On Etala Rajender
dasari bhumaiah Comments On Etala Rajender

ఈరోజు బీజేపీ పార్టీలో చేరి టీఆర్ఎస్ మీద పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో.. టీఆర్ఎస్ జెండా గుర్తు మీద గెలిచాననే విషయం మర్చిపోతున్నాడన్నారు రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్థికమంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ హుజురాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ప్రభుత్వం చేసిందే అనే విషయం నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. మామ కోసం హరీష్ రావు తప్పు చేస్తున్నాడు.. ఆయన చాలా మంచి వ్యక్తి అన్న నువ్వు.. ఈ రోజు ఎందుకు మాట మార్చినవ్? నువ్వెందుకు మారినవ్? అంటూ దుయ్యబట్టారు.

dasari bhumaiah Comments On Etala Rajender
dasari bhumaiah Comments On Etala Rajender

ప్రజలు చైతన్యవంతులు. వారిని మోసం చేయలేవు. కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తారు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరికో యాభై లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టిచ్చిన అన్నవ్ కదా.. ఈటల రాజేందర్.. రుజువు చేస్తావా అని ప్రశ్నించారు. జానీ అనే దళిత వ్యక్తి మీద కేసులు పెట్టి, పీడీ యాక్ట్ పెట్టించి కొట్టించింది నువ్వనే విషయం మాకు తెలియదనుకున్నావా? ఇదేనా నీ ఆత్మగౌరవం అంటూ ప్రశ్నించారు. నువ్వు మంచోడివైతే.. పెద్దపాపయ్య పల్లిలో ప్రజలు నీ మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తారు అని అడిగారు దాసరి భూమయ్య. రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేలా కష్టపడుతున్న టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం నా వంతు సహకారం అందిస్తానని ఆయన అన్నారు.