పండుగపూట బాలుడి మరణంతో విషాద ఛాయలు

dead body

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో పండుగపూట బాలుడి మరణంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. పిచ్చి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు ఏరేకర్ క్రాంతి (10) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వారం క్రితం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో క్రాంతిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి.  తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి వారం పాటు చికిత్స అందించిన ఫలితం దక్కలేదని బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.