వన్డే సిరీస్ లో చివరిదైన మూడో వన్డేలో భారత్కు దక్షిణాఫ్రికా 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీల జట్టు 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ డికాక్ (130 బంతుల్లో 124: 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డస్సెన్ (52: 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (39), ప్రిటోరియస్ (20) ధాటిగా ఆడటంతో భారీ స్కోరు చేసింది.
మిగతా బ్యాటర్లలో మలన్ 1, బవుమా 8, మార్క్రమ్ 15, పెహులుక్వాయో 4, మహరాజ్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ 3, బుమ్రా 2, దీపక్ చాహర్ 2, చాహల్ ఒక వికెట్ పడగొట్టారు.
South Africa are bowled out for 287 ✌🏻
India do well to restrict the hosts in the final few overs 👏🏻
Watch the series live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#SAvIND | https://t.co/u8dAzkQuxt pic.twitter.com/IvAkM1GOQO
— ICC (@ICC) January 23, 2022