తగ్గిన కరోనా ఉధృతి.. కొత్తగా 162 కరోనా కేసులు - TNews Telugu

తగ్గిన కరోనా ఉధృతి.. కొత్తగా 162 కరోనా కేసులుCoronavirus updates: India reports 62,480 new cases in last 24 hours

రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,506 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారి నుంచి నిన్న 214 మంది కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.

తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,67,887కి చేరగా.. మృతుల సంఖ్య 3,930కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,235 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది.