ఫిబ్రవరి 11న ‘గెహ్రాహియా’.. ఆ సీన్లలో నటించడం అంత సులువు కాదన్న దీపికా

‘Gehrahiya’ Movie

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె వివాహం అనంతరం నటించిన పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం ‘గెహ్రాహియా’. షకున్‌ భత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే కీలకపాత్రలు పోషించారు.

ఫిబ్రవరి 11న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గెహ్రాహియా’ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

మోడ్రన్‌ ఏజ్‌ లవ్‌స్టోరీగా సిద్ధమైన ఈ సినిమాలో దీపికా, సిద్ధాంత్‌ల మధ్య ముద్దు సన్నివేశాలతోపాటు కొన్ని రొమాంటిక్‌ సీన్లు కూడా ఉన్నాయి. దీంతో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడంపై దీపిక మాట్లాడుతూ.. సెట్‌లో అందరి ముందు కోస్టార్స్ తో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదన్నారు. దర్శకుడు షకున్‌ అన్ని విధాలుగా భద్రత కల్పించిన తర్వాతనే ముద్దు, రొమాంటిక్‌ సన్నివేశాలు చేయగల్గినట్లు చెప్పారు.