మీ బొందరా.. నేను షణ్ముఖ్ తో.. చిల్లర పనులు చేయను.. దీప్తి సునయన సీరియస్.. అసలేం జరిగిందంటే ?

Deepthi Sunaina Clarity On Latest Controversy With Shanmukh In Bigg Boss Telugu Season 5
Deepthi Sunaina Clarity On Latest Controversy With Shanmukh In Bigg Boss Telugu Season 5

బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌ సూపర్ స్పెషల్‌గా ముగిసింది. మొదట ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతే.. ఆ తరువాత లవ్ మూమెంట్స్ ని కూడా చాల అందంగా ప్రజెంట్ చేసింది బిగ్ బాస్ టీమ్. ముఖ్యంగా షణ్ముఖ్, సిరిల మూగ ప్రేమపై సోషల్ మీడియాలో ఒకటే కథనాలు. ఆ క్రేజ్ క్యాచ్ చేసుకోడానికే అన్నట్టు.. వీరిద్దరి లవర్స్ కూడా హౌస్ లో ఎంట్రీ ఇవ్వటంతో ఒక్కసారిగా బిగ్ బాస్ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ఈ లవర్స్ ప్రమోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వగా… నిన్నటి ఫుల్ ఎపిసోడ్ కూడా రసవత్తరంగా సాగింది. హౌస్ బయట వేరేవారితో రిలేషన్ లో ఉన్న సిరి షణ్ముఖ్ లు.. హౌస్ లోపల ఒకరికి తెలియకుండా ఒకరు కలిసిపోతున్నట్టు గత వారం పది రోజుల నుండి విపరీతమైన చర్చ నడుస్తుండటంతో.. ఈ ఇద్దరి లవర్స్ హౌస్ లో ప్రత్యక్షమవ్వటంతో ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటారో అని విపరీతమైన ఆసక్తి నెలకొంది. పెరిగిన అంచనాలనీ అందుకుంటూనే ఈ వీకెండ్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది.

ముఖ్యంగా దీప్తి సునయన, షణ్ముఖ్ జంట ముచ్చట్లకి సోషల్ మీడియాలో మంచి కవరేజ్ వచ్చింది. దీంతో ట్రోలర్స్ కి కూడా కావాల్సినంత కంటెంట్ దొరికినట్లయింది. తాజాగా దీప్తి సునయన తన సైగలతో షణ్ముఖ్ కి ఎదో చెప్పే ప్రయత్నం చేసిందని ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్టేజిపై షణ్ముఖ్‌కు దీప్తి ఓ హింట్‌ ఇచ్చిందని.. స్టేజ్‌ మీదకు వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుని షణ్ముఖ్‌ రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. షణ్ముక్ కూడా దీప్తి వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడని, ఆమె పక్కా ప్లాన్‌ ప్రకారమే హింట్‌ ఇచ్చిందని దానికి సంబంధించిన వీడియోని వైరల్‌ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ కి తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది దీప్తి సునయన. ‘ నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయనంటూ తన ఇన్‌స్టా స్టోరీతో ఓ పోస్ట్‌ని పెట్టింది. ‘మీ బొందరా మీ బొంద.. నా జీవితంలో ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ని ప్రయోగించను. షణ్ముఖ్‌ విషయంలోనే కాదు.. నా లైఫ్‌లో దేనికోసం అలాంటి పనులు చేయను. నా దృష్టిలో షణ్ముఖే బిగ్‌బాస్‌ విన్నర్‌’అని దీప్తి చెప్పుకొచ్చింది.