విద్యార్థుల‌తో అద్భుతమైన డ్యాన్స్.. ఢిల్లీ టీచ‌ర్ వీడియో వైరల్

విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌డంతోపాటు డ్యాన్స్ నేర్పిస్తూ..వాళ్ల‌తో క‌లిసి స‌ర‌దాగా నృత్యం చేస్తున్న ఢిల్లీ టీచ‌ర్ వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌ను ఢిల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల టీచ‌ర్ మ‌ను గులాటీ త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

ఈ వీడియోలో మ‌ను గులాటీ త‌న విద్యార్థుల‌తో క‌లిసి బాలీవుడ్ సినిమా ‘కిస్మ‌త్‌’లోని ఎవర్‌గ్రీన్ సాంగ్‌ ‘కజ్రా మొహబ్బత్ వాలా’ పై ఎంతో పర్‌ఫెక్ట్‌ స్టెప్పులేసి వావ్ అనిపించారు. ఇది త‌మ స‌మ్మ‌ర్ క్యాంపు చివ‌రి రోజని.. ఆనందం, క‌ల‌యిక తోడైతే అంద‌మైన స్టెప్పులు పుడ‌తాయ‌ని గులాటీ ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 5.5ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ ఢిల్లీ టీచర్ పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ‘సమాజానికి మీలాంటి ఉపాధ్యాయులు కావాలి’, ‘ మీలాంటి టీచర్లుంటే.. చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాలను కూడా విద్యార్థులు ఆస్వాదిస్తారు’, ‘గుడ్ జాబ్ టీచర్.. మీకు గ్రాండ్ సెల్యూట్.’ అంటూ నెటిజర్లు కామెంట్స్ పెడుతున్నారు.