ఢిల్లీలో రూ.18కోట్ల హెరాయిన్ పట్టుకున్న పోలీసులు.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Delhi Police Caught herain drug
Delhi Police Caught herain drug
Delhi Police Caught herain drug
Delhi Police Caught herain drug

దేశ రాజధానిలో భారీమొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ శివార్లలో హెరాయిన్ అమ్ముతున్న ఢిల్లీ నార్కొటిక్స్ సిబ్బంది ఇద్దరు నిందితుల నుంచి ఆరు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ రూ.18 కోట్లు ఉంటుందని డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు. హెరాయిన్ ఎక్కడి నుంచి సేకరించారు.. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.