రేవంత్ రెడ్డి ఆరోపణలు సరైనవి కాదు : డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ పోలీసులపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నామని నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు. కేంద్ర గైడ్ లైన్స్, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారమే మేము మా విధులు నిర్వహిస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలలో అవకతవకలు జరుగుతున్నాయనేది నిజం కాదు. బదిలీలన్నీ రిక్రూట్ మెంట్ ప్రకారమే జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు మావోల దాడుల్లో 350 మంది పోలీసులు చనిపోయారు. ఆ ఖాళీలు భర్తీ చేసే ప్రక్రియలో బదిలీలు, రిక్రూట్ మెంట్ జరుగుతుంది. ప్రజల కోసం, నాయకుల కోసం, శాంతి భద్రతలను కాపాడటం కోసం పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పోలీస్ శాఖ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు.