వేములవాడ రాజన్నను దర్శించుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని డీజీపీ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు.  రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌తో కలిసి ఆయన ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆధ్వర్యంలో పోలీస్‌ అధికారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌, పట్టణ సీఐ వెంకటేశ్‌, ఆలయ
అధికారులు పాల్గొన్నారు.