అంతా ఆ ఇద్దరే చేశారా? వారి మీద ఉన్న ఫ్రస్ట్రేషనే రచ్చకు కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎప్పుడు లేని పరిణామం చోటు చేసుకుంది. మా ఎన్నికల్లో గెలిచి కూడా చాలా మంది సభ్యులు రిజైన్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఎందుకు? ప్యానెల్ వేరైనంతా మాత్రాన రిజైన్ చేయాలా? గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్ గా మారింది. కానీ ఈ రచ్చకు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు స్పష్టమైంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా ఓపెన్ గానే ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు.

మోహన్ బాబు అంతగా రెచ్చిపోయాడా?

మా ఎన్నికల్లో గెలిచింది విష్ణుయే గానీ ఓవర్ యాక్షనంతా మోహన్ బాబు దేనని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెప్పారు. అవును అంతగా రెచ్చిపోతు చెలరేగిపోయారంట. ఎన్నికల రోజు ఆయన చేసిన హంగామా చూసి షాక్ అయ్యామని అన్నారు. పైకి మాత్రం అంతా సాఫీగానే సాగినట్లు అనిపించినప్పటికీ ఈ ప్రెస్ మీట్ తర్వాత వామ్మో ఎన్నికల్లో ఇంత జరిగిందా అని చర్చ మొదలైంది. మోహన్ బాబు ఐతే అమ్మనా బూతులు తిడుతూ, దాడికి తెగబడ్డారంట. మంచు విష్ణు, మనోజ్ లు ఎంత సముదాయించినప్పటికీ తగ్గేదేలేదంటూ బూతుల మీది నుంచి దిగలేదంట. వాళ్లు, వీళ్లు అని కాదు ఎవరి కనిపిస్తే వారిపై అరవటం చేశాడంట. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత పరిస్థితి ఏంటంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

నరేష్ అలాంటోడా!

ఇక నరేష్ గురించి ఈ ప్రెస్ మీట్ లో చాలా విషయాలు బయటకొచ్చాయి. అసలే మొన్నటి దాకా మా ప్రెసిడెంట్ గా చేసిన ఆయనపై ఎన్నోఆరోపణలున్నాయి. తను మా అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో డెవలప్ మెంట్ జరగలేదని సభ్యులే ఆరోపణలు చేశారు. ఐతే ఈ సారి మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతుగా నిలిచారు. కానీ మోహన్ బాబు రేంజ్ లో నరేష్ కూడా బిల్డప్ ఇచ్చాడంట. చాలా మంది సభ్యులతో ఓటింగ్ రోజు గొడవపడ్డాడంట. గతంలో ఆయన చేసిన పనులు, ఎన్నికల నాడు చేసిన ఓవరాక్షన్ తో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న వారంతా ఆగమాయ్యారు.

 

ఈ ఇద్దరినీ భరించలేకే

మంచు విష్ణు గెలిచినప్పటికీ అసలు పోటీ చేసిందే మోహన్ బాబు అన్నట్లు తమకు అనిపించిందని ప్రకాష్ రాజ్ టీమ్ చెప్పింది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ లో ప్రతి దానికి ఆయన జోక్యం ఉంటుందని తమకు అర్థమైందన్నారు. పెద్ద వాడైనా మోహన్ బాబు తో ఢీకొట్టలేమని అందుకే ఇప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక నరేష్ కూడా విష్ణు వెంటే ఉంటాడని తమకు తెలిసిందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆయన ఉన్న చోట తామ ఉండలేమని తేల్చిచెప్పారు. దీంతో ఈ ఇద్దరి కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.