లాయర్ అడ్వకేట్ మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? రెండూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే! - TNews Telugu

లాయర్ అడ్వకేట్ మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? రెండూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే!మనం నిత్యం చూసేవే కొన్ని సందర్భాల్లో తెలియక వేరేలా అర్థం చేసుకుంటాం. చివరికి మనకు తెలిసిన అర్థం అది కాదని.. వేరే అని తెలిసి ముక్కున వేలేసుకుంటాం. చిన్న చిన్న పదాల్లోనే చాలా తేడా ఉంటుందనే విషయాన్ని గమనించం. అలాంటి పదాల్లో.. లాయర్.. అడ్వకేట్ అనే పదాలు కూడా ఉన్నాయి. చాలామంది లాయర్ అన్నా.. అడ్వకేట్ అన్నా ఒకటే అనుకుంటారు. కానీ.. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది. బైజూస్ ప్రకారం రెండు వేర్వేరు. ఆ తేడాలేంటో తెలియాలంటే ఓ లుక్కేయండి.


లా పూర్తి చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా (ఎల్ఎల్బీ) డిగ్రీ అందుకున్న వారిని లాయర్ అంటారు. ఇండియాలో లాయర్ గా, గ్రాడ్యుయేట్ స్థానంలో ప్రాక్టీస్ చేయాలని అనుకునేవారు ముందుగా స్టేట్ బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకోవాలి. ఆలిండియా బార్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించాలి. ఆ తర్వాత ఒక అడ్వకేట్ వద్ద ప్రాక్టీస్ చేయాలి. ఎల్ఎల్బీ డిగ్రీ ఉండి.. బార్ పరీక్ష రాసి పాసైన వారిని అడ్వకేట్ అంటారు. లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలరు. కోర్టులో వాదించలేరు. క్లయింట్ తరపున కోర్టులో వాదించలేరు. కానీ.. అడ్వకేట్ కోర్టులో కేసు వాదించగలరు. కేసును బట్టి క్లయింట్ తరపున కేసు వాదించడం, నష్ట పరిహారం ఇప్పించడం చేయగలరు.

Differance Between Lawyer And Advocate

లా స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే లాయర్ అవుతారు. అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేసి.. బార్ ఎగ్జామ్ పాస్ అయితే అడ్వకేట్ అవుతారు. న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి. అడ్వకేట్ అప్పటికే ప్రాక్టీస్ పూర్తి చేసి ఎన్నో కేసులు వాదించి ఉంటారు కాబట్టి.. వారికి అనుభవం ఉంటుంది. ఎలాంటి కేసులు వాదించకుండా.. కేవలం డిగ్రీ పూర్తి చేసి న్యాయసలహాలు మాత్రమే ఇవ్వగలిగిన వారిని లాయర్ అంటారు. లాయర్ కోర్ట్ లో కేసు వాదించలేరు. అందుకే అడ్వకేట్ తో పోలిస్తే లాయర్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వేరే దేశాల్లో న్యాయవిద్య చదివితే వారిని బారిష్టర్ అని అంటారు. బారిస్టర్ కూడా అడ్వకేట్ తో సమానం. కేవలం పేరు తేడా అంతే. కానీ బారిస్టర్ కూడా అడ్వకేట్ లాగే కేసు టేకప్ చేసి వాదించగలరు.