నీకు నచ్చుతే చూడు లేకపోతే చూడకు.. రిపోర్టర్ పై దిల్ రాజు సీరియస్.. ఎందుకో తెలుసా ?

Dil Raju Serious On Reporter At Rowdy Boys Movie Theater
Dil Raju Serious On Reporter At Rowdy Boys Movie Theater

‘దిల్‌’ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీబాయ్స్‌’. ‘హుషారు’ ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ మూవీని ఐమాక్స్ లో ప్రేక్షకులతో కలిసి చూసిన దిల్ రాజ్ బయట మీడియాతో మాట్లాడాడు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని పెద్ద డైరెక్టర్ తో లాంచ్ చేయకుండా.. చిన్న దర్శకుడి చేతిలో పెట్టారు. స్టార్లని కాకుండా స్టోరీని నమ్మే నిర్మాత కాబట్టే తన వారసుడిని సాదాసీదాగా వెండితెరకి పరిచయం చేశాడు. ఈ నేపథ్యంలో సినిమా చూసి వచ్చిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఆశిష్ ని పెద్ద దర్శకుడితో తీయొచ్చు.. కానీ అతను డబ్బు కోసమో, ఆబ్లిగేషన్ కోసమో చేస్తాడు. అలా కాకుండా ఒక కొత్త హీరోలానే ఆశిష్‌ ని ఇంట్రడ్యూస్ చేయాలనీ మంచి కథతో చేశామని చెప్పాడు దిల్ రాజు. ఇక థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చాలా బాగుందని.. ఒక నిర్మాతగా ఈ సినిమాపై, హీరో ఆశిష్ పై పూర్తి సంతృప్తిగా ఉన్నానని.. చెప్తూ వెళ్లిపోతుంటే విలేకరుల గుంపులో ఒక వ్యక్తి నుండి దిల్ రాజుకి చేదు అనుభవం ఎదురైంది.

అసలు రౌడీబాయ్స్‌ చిత్రంలో ఏముందని ఇంత ఖర్చు పెట్టారు సర్ అని అందరిముందే దిల్ రాజుని ఆ వ్యక్తి నిలదీశాడు. దీంతో అతన్ని పట్టించుకోకుండా దిల్ రాజు వెళ్లిపోతుంటే మళ్ళీ పదునైన విమర్శలతో దిల్ రాజుని అసహనం లోనయ్యేలా చేశాడు. కథలో కొత్తదనం లేదు, హీరోయిన్ అనుపమాతో లిప్ కిస్ లు ఏంటీ.. రెండు ఫైట్స్, మూడు సాంగ్స్ ఉంటే సినిమా అయిపోతుందా.. కథని నమ్మే నిర్మాతగా మీకు మంచి పేరుంది. మీలాంటి ప్రొడ్యూసర్ తీయాల్సిన సినిమా ఇది కాదు సర్ అంటూ చేసిన ఆ వ్యక్తి కామెంట్స్ తో ఇబ్బంది పడ్డాడు దిల్ రాజు. అతన్ని తప్పించుకుంటూ వెళ్తున్న దిల్ రాజు ఒక్కసారిగా ఆగి వెనక్కి వెళ్లి అతనికి చిన్నపాటి వార్ణింగ్ ఇచ్చాడు. ‘నీకు సినిమా నచ్చితే చూడు లేదంటే చూడకు’ అని అతనిపై అసహనం వ్యక్తం చేసి వెళ్ళిపోయాడు దిల్ రాజు. వీరిద్దరి సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.