సంగారెడ్డి అనుదీప్ డబుల్ ధమాకా… మరో రెండు హిట్లు పక్క …!

Director Anudeep Works On Two Scripts At A Time
Director Anudeep Works On Two Scripts At A Time
Director Anudeep Works On Two Scripts At A Time
Director Anudeep Works On Two Scripts At A Time

తెలంగాణ సంగారెడ్డికి చెందిన యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి – ఫరీదా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ”జాతిరత్నాలు”. స్వప్న సినిమాస్ పతాకంపై ‘మహానటి’ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు అనుదీప్ కు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి సినిమా స్వప్న సినిమాస్ – వైజయంతీ మూవీస్ సంస్థలతోనే ఉంటుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.


అనుదీప్ కేవీ ప్రస్తుతం రెండు కథల పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తనదైన శైలి హ్యూమర్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. అలానే ‘జాతిరత్నాలు’ సీక్వెల్ స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభించాడని సమాచారం. వాస్తవానికి ‘జాతిరత్నాలు’ సక్సెస్ మీట్ లోనే ‘జాతిరత్నాలు 2’ తెరకెక్కించనున్నట్లు అనుదీప్ ప్రకటించాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్న యువ దర్శకుడు.. దీని కోసం నాగ్ అశ్విన్ రచనా సహకారం తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘జాతి రత్నాలు’ లో నటించిన నవీన్ – ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ – ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు 2’ లో కూడా నటించనున్నారు.