తాగిన మత్తులో.. వరుణ్ తేజ్ హీరోయిన్ దిశా చెల్లి రచ్చ..!

Disha Patani Sister Khushboo Patani Birthday Celebrations
Disha Patani Sister Khushboo Patani Birthday Celebrations

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లోఫర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైనా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. ఫిట్నెస్ లో బాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తగ్గని దిశా.. జిమ్ వర్కౌట్ వీడియోస్ తో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఇక బాలీవుడ్ అథ్లెటిక్ స్టార్ టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తూ కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. హీరోలకు దీటైన యాక్షన్ సన్నివేశాల్లో చాల ఈజీగా చేసేస్తుంది దిశా. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆమెకు సోదరి ఖుష్బూ పటానీ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినీ రంగంలో అడుగుపెట్టనప్పటికి తన అందం, గ్లామర్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. మంగళవారం దిశ సోదరి ఖుష్బూ పటానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్‌డే పార్టీలో ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పార్టీలో టెబుల్‌ పైకి ఎక్కి మరి ఖుష్బు డ్యాన్స్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను దిశ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ హ్యీప బర్త్‌డే మై క్రేజీ సిస్‌, నీలా నేను కూడా డ్యాన్స్‌ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది దిశా పటానీ. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. రెస్టారెంట్ లో అందరిముందే టేబుల్ ఎక్కి మరి చిందులు వేస్తుంటేనే తెలిసిపోతుంది.. ఖుష్బూ ఫుల్ గా మందు కొట్టిందని అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఖుష్బూ పటాని ఇండియన్ ఆర్మీలో పని చేస్తుండటం గమనార్హం.