‘మా’లో భారీ చీలిక.. మెగా అండతో కొత్త సంఘం.. ఏకగ్రీవ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్.. సంచలన వార్త నిజమేనా ? - TNews Telugu

‘మా’లో భారీ చీలిక.. మెగా అండతో కొత్త సంఘం.. ఏకగ్రీవ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్.. సంచలన వార్త నిజమేనా ?



New Association May formed Maa Association Divided Into Two Parts
New Association May formed Maa Association Divided Into Two Parts

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలవటమేమో కానీ.. ఇండస్ట్రీలో భారీ చీలికలు తీసుకొచ్చేలా పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. కుల, మత, ప్రాంతాలకి అతీతమైన సిని మా ఎన్నికల్లో ప్రాంతీయవాదం తీసుకొచ్చి ప్రకాశ్ రాజ్ ని ఓడించటంలో మంచు ప్యానల్ సక్సెస్ అయ్యిందని.. కానీ ఇలాంటి ప్రచారం భవిష్యత్తులో ప్రమాదకరమని భావిస్తున్నారు కొందరు ఇండస్ట్రీ పెద్దలు. తెలుగేతరులకి సరైన గౌరవం దక్కటం లేదని ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించగా.. ఇలాంటి కుసంస్కార మా సభ్యుల మధ్య నేను కొనసాగనంటూ నాగబాబు కూడా తీవ్ర ఆవేదనతో మా సభ్యత్వానికి రాజీనామా చేసేశాడు. ప్రకాష్ రాజ్, నాగబాబు కి మద్దత్తుగా మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా రాజీనామా చేయగా.. మునుముందు ఈ రాజీనామాల పర్వం మరింత పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.

మా ఎన్నికల్లో కులం కార్డు..

ఇంకొందరైతే ఈ మా ఎన్నికల్లో కులం కార్డు కూడా వాడినట్టు విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో బడా నిర్మాతలు, స్టూడియో అధిపతులు లు చాల వరకు ఒకే కులానికి చెందినవారని.. వారంతా కలిసి మంచు కుటుంబానికి వన్ సైడ్ సపోర్ట్ చేశారని.. ఇండస్ట్రీలో ఇన్నర్ టాక్. బయటికి మేమంతా ఒకటే అని కామెంట్స్ చేస్తున్నా.. కుల, ప్రాంతీయవాదంతో మంచు వర్గం గెలవటంతో లోలోపల చాల మంది సభ్యులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ అసంతృప్తి సభ్యులంతా స్థానికత భావనలు లేని సినీ కళాకారులతో మరో సంఘం పెట్టనున్నారా అంటే అవుననే సమాదానాలు వస్తున్నాయి.

వరుస రాజీనామాలు.. భారీ చీలిక దిశ‌గా ‘మా’ అసోసియేష‌న్..

ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఇంత సేవ చేస్తుంటే.. నన్ను నాన్ లోకల్ అంటూ పబ్లిసిటీ చేసి ఇండస్ట్రీ నుండి వేరు చేస్తారా అంటూ.. తీవ్ర ఆవేదనతో ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ప్రకాష్ కి సపోర్టుగా నాగబాబు, శివాజీరాజా కూడా రాజీనామా చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులు కూడా మా మెంబర్ షిప్ కి రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీలో నిల‌బ‌డి గెలిచిన శ్రీ‌కాంత్‌తోపాటు ఇత‌ర స‌భ్యులు కూడా రాజీనామా చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు, ప్ర‌కాష్ రాజ్ అండ్ కో. క‌లిసి ఓ కొత్త అసోసియేష‌న్‌ను పెడ‌తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ అనూహ్య నిర్ణయాలకు మంచు కుటుంబం కూడా కారణమని అంటున్నారు.

ప్రమాణస్వీకారానికి ముందే.. మెగా ఫ్యామిలీపై అటాక్..!

ఎలాంటి పదవుల్లో లేనప్పుడే మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తూ టార్గెట్ చేసే వీరు.. ఇప్పుడు మరింత వేగం పెంచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. మేమె ఇండస్ట్రీ పెద్దలం అనుకునే వారికి.. నా గెలుపు ఒక గుణపాఠం అంటూ.. ఇప్పటికి మంచు విష్ణు మెగా ఫ్యామిలీని అటాక్ చేయటం స్టార్ట్ చేసేశాడు. ప్రమాణస్వీకారం ముందే ఇలాగుంటే.. పదవి చేపట్టిన తరువాత మెగా హీరోలకి చుక్కలే అని సంకేతాలు ఇచ్చేడు విష్ణు. ఇక ‘మా’ కి రాజకీయ రంగు కూడా పులమటం మెగా వర్గానికి అస్సలు నచ్చటంలేదని అంటున్నారు. తనకి ఆంద్ర సీఎం జగన్ సపోర్ట్ ఉందని వ్యాఖ్యానించటం, ప్రకాశ్ రాజ్ కి మద్దత్తు ఇచ్చిన మెగా ఫ్యామిలీని ‘తుకుడే గ్యాంగ్’ అంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తిట్టడం మెగా ఫ్యామిలీకి రుచించటంలేదని అంటున్నారు. అందరిదైనా ఇండస్ట్రీని..
ఇలా రాజకీయంగా, ప్రాంతీయంగా విడకొట్టి గెలవాలని తెరవెనుక ముందే ప్లానింగ్ జరిగిందని..దాన్నిమెగా వర్గం కొంచం ఆలస్యంగా గ్రహించారని అంటున్నారు.

మెగా అండతో కొత్త సంఘం ?

ఇక కొంచం ఆలస్యమైనా ఈ కుట్రలని పసిగట్టిన నాగబాబు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండే సగం ఆదాయం. 10మంది వరకు స్టార్ హీరోలు. అల్లు అరవింద్, దిల్ రాజు, అక్కినేని నాగార్జున, సురేష్ బాబు వంటి ఇండస్ట్రీ పెద్దలంతా మెగా ఫ్యామిలీకి సానుభూతిపరులే. ఈ నేపథ్యంలో ఇలాంటి లైట్ మెంటాలిటీ ఉండే పెద్దల సపోర్ట్ తో మరో సంఘాన్ని స్థాపించబోతున్నారని.. ఆ సంఘానికి ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఏదేమైనా గడిచిన రెండు నెలల నుండి మా ఎన్నికలు ఇండస్ట్రీలో అగ్గిని రాజెయ్యగా.. ఇప్పుడు ఫలితాల తరువాత జరుగుతున్న వరుస రాజీనామాల పర్వం..తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని ప్రకంపనలు సృష్టించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

Tags:, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,