ఎగ్జిట్ పోల్స్ సర్వేలు.. మీడియాలో ప్రచారం చేస్తే అంతే సంగతి.. ఎన్నికల అధికారి ఆదేశాలు

District Election Officer who issued several orders in the wake of Huzurabad election

అక్టోబర్ 30 రాత్రి 7:30 వరకు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని.. వాటిని ఉల్లంఘించిన వారు శిక్షార్హులని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ఎగ్జిట్ పోల్స్.. సర్వేలు నిర్వహించకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

అలా చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (ఏ) ప్రకారం శిక్షార్హులని తెలిపారు. అక్టోబర్ 30 రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు, ప్రింట్ మీడియా ప్రచురణలు చేయకూడదని.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేయరాదని, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా, ప్రింటి మీడియాలో ప్రచురించినా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేసినా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లే అని.. చట్టం ప్రకారం వారు శిక్షార్హులని కలెక్టర్ తెలిపారు.