జిల్లాల రౌండప్ @ 10 pm

* జోగులాంబ గద్వాల జిల్లా.. కేటిదొడ్డి మండలం కోండాపురం గ్రామానికి చెందిన గద్వాల వెంకటప్ప అనే రైతు విద్యుత్ షాక్ కు గురై మృతి.

* నాగర్ కర్నూల్  జిల్లా.. పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాములలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. రూ.8940 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. 9 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .. భద్రాచలంలోని సాయి గణేష్ రైస్ మిల్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 క్వింటాళ్ల  పిడిఎస్ బియ్యంని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు.

* చత్తీస్ ఘడ్..సుకుమా జిల్లా పొలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్లంపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టు అమరవీరుల స్థూపాలను ధ్వంసం చేసిన పోలీసులు.

* హైదరాబాద్.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో వర్షం.

* వరంగల్ అర్బన్.. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త గడ్డం సామెల్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా…టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ములకలపల్లి మండలం చాపరాల పల్లి గ్రామ అడవి ప్రాంతంలో అడవి జంతువు(దుప్పి) ని వేటాడిన వేటగాళ్లు. మాంసాన్ని విక్రయించిన వేటగాళ్ళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అటవీశాఖ అధికారులు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..  దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద గోదావరి వరదల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష  నిర్వహించిన జిల్లా కలెక్టర్ అనుదీప్. గోదావరి నదిలో ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించిన సిబ్బంది.

* వరంగల్ రూరల్.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం  వినయ్ భాస్కర్ , రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్.

* కరీంనగర్ జిల్లా..  సైదాపూర్  మండలానికి చెందిన 7 గ్రామాలకు  చెందిన లబ్ధిదారులకు 2,54,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులును పంపిణీ చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే  సతీష్ కుమార్.

* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..  ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తండ్రి శంకర్ నాయక్  మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

* నిజామాబాద్.. దొంగతనం కేసును ఛేదించిన బోధన్ పొలీసులు. బోధన్ మండలం బావానిపెట్  గ్రామంలో ఓ ఇంట్లో జరిగిన దొంగ తనం కేసులో 3 ముగ్గురు ని0దితులను పట్టుకుని వారివద్ద నుండి 22 తులాల బంగారం,11 తులాల వెండి స్వాధీనం చేసుకునట్లువెల్లడించిన ఏసీపీ రామారావు.

* నారాయణపేట జిల్లా.. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల మార్కెట్  కమిటి చెర్మెన్ గా ఎన్నికైన గావినోళ్ళ విరరెడ్డికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలియజేశారు.

* నాగర్ కర్నూల్ జిల్లా.. అచ్చంపేట పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి నీళ్ళు పోసిన జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల.

* నాగర్ కర్నూల్ జిల్లా.. అమ్రాబాద్ మండల కేంద్రంలో 32మంది కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,జెడ్పి చైర్మన్ పద్మావతి.