ఈ ఫుడ్ తినేముందు తిన్న తర్వాత పాలు అస్సలు తాగొద్దట..

రోజూ పాలు తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల దృఢత్వానికి పాలు తాగమని ఆహార నిపుణులు సూచిస్తారు. బాడీలో ప్రోటీన్ లోపానికి పాలు మంచి పరిష్కారం. ఒత్తిడిని దూరం చేసి, శరీరాన్ని దృఢంగా ఉంచడంలో పాలు బెస్ట్. ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఇచ్చే పాలు కొన్ని ఆహారపదార్థాలతో కలిపి అస్సలు తీసుకోవద్దట. అలా తీసుకుంటే పాల వల్ల వచ్చే ఆరోగ్యప్రయోజనాల కంటే.. హాని ఎక్కువట. ఇంతకీ పాలు తాగే ముందు, పాలు తాగిన తర్వాత తీసుకునే ఆ ఆహార పదార్థాలేవో చూద్దాం.

చేపలు, చికెన్
పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో కలిపి చేపలు అస్సలు తినొద్దట. ఎందుకంటే.. చేపల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. పాల ఉత్పత్తులు కూడా సేమ్ ఇలాంటి లక్షణాలే కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ వ్యవధిలో కలిపి తింటే.. ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడక తప్పదు.

సిట్రస్ జాతి పండ్లు
నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ వంటి సిట్రస్ జాతి పండ్లు తినే ముందు.. తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగకూడదు. ఎందుకంటే సిట్రస్ జాతి పళ్లలో ఉండే యాసిడ్లు పాలను విషపూరిత పదార్థాలుగా మారుస్తాయి. అందుకే.. సిట్రస్ జాతి పండ్లు తిన్నప్పుడు పాలు తాగకూడదు.

నువ్వులు, ఉప్పు
మీరు తినే ఆహారంలో నువ్వులు, ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటే ఆ తర్వాత కనీసం 2 గంటల పాటు పాలు, పెరుగు తినొద్దట. ఇలా తింటే శరీరానికి మంచిది కాదు. ఇది చర్మ సమస్యలకు కారణం అవుతుంది.

పాలకూర, పనసపండ్లు
పాలకూర, పనసపండు రుచికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే వీటిని తిన్న తర్వాత పాలు, పెరుగు అస్సలు తీసుకోకూడదు. ఇలా తింటే.. కిడ్నీలో రాళ్లు, చుండ్రు, దురద, తామర, సొరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి.