భూపాలపల్లి నుంచి బొగ్గు ఇతర ప్రాంతాలకు తరలించొద్దు

vinod kumar comments about Redistribution of constituencies
vinod kumar comments about Redistribution of constituencies

భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులకు మౌఖికంగా ఆదేశించారని వినోద్ కుమార్ చెప్పారు.

ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని చెప్పి తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును తరలించి భూపాలపల్లి విద్యుత్ ఉత్పత్తి కి విఘాతం కలిగిస్తే ఎలా..? అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న ఆలోచనను మానుకోవాలని వినోద్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు.