ఛాయ్ లో బిస్కెట్లు అద్దుకొని తినడం మనోళ్లకు ఎప్పటి నుంచి అలవాటయిందో తెలుసా! - TNews Telugu

ఛాయ్ లో బిస్కెట్లు అద్దుకొని తినడం మనోళ్లకు ఎప్పటి నుంచి అలవాటయిందో తెలుసా!ఛాయ్ బిస్కెట్ అంటే అదో క్రేజీ కాంబినేషన్. ఛాయ్ లో బిస్కెట్ అద్దుకొని తింటుంటే.. ఆ టేస్ట్ అదిరిపోతుంది. సాయంత్రం సమయంలో సన్నగా చిరుజల్లులు పడుతుంటూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కప్పులో టీ సిప్ చేస్తుంటే ఆ మజా గురించి మాటల్లో చెప్పలేం. అయితే.. ఛాయ్ తాగుతూ అందులో బిస్కెట్ అద్దుకొని తినే అలవాటు ఎప్పటి నుంచి, ఎవరి నుంచి వచ్చిందో తెలుసా?


బ్రిటిష్ వాళ్లు మనదేశాన్ని పరిపాలించడం మొదలైన తర్వాత వారి నుంచి ఈ అలవాటు మనవారికి మొదలైందట. అసలు భారత్ లో బిస్కట్ల తయారీ 16వ శతాబ్దంలో మొదలైంది.

ఆ కాలంలో తయారు చేసే బిస్కెట్లు చాలా గట్టిగా ఉండేవి. దీనితో బ్రిటిష్ వారు వాటిని వేడి వేడి ఛాయ్ లో అద్దుకుని తినేవారు. అలా ఆ అలవాటు వారి నుంచి మనకు వచ్చింది.

అయితే అప్పటి మనవారికి ఛాయ్ అలవాటు లేదు. బ్రిటిష్ వారు ఇండియాలో తేయాకు పెంచడం మొదలుపెట్టిన తర్వాత.. టీ పొడి ఇక్కడే లభిస్తుండటంతో మనోళ్లకు కూడా టీ తాగే అలవాటు మొదలైంది. ఆ తర్వాత మెల్లగా వేడివేడి ఛాయ్ లో బిస్కెట్లు అద్దుకొని తినడం మొదలైంది.