అందంగా కనిపించాలా? ఐతే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి.

అందంగా ఉండాలని ఎవరికీ మాత్రం ఉండదు. బాగా కనిపించేందుకు చాలా మంది వేలాల్లో ఖర్చు చేస్తారు. డైటింగ్ లు, ఎక్సర్ సైజ్ లు అన్ని కూడా ఆరోగ్యంతో పాటు అందానికి కూడా. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అందానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మరి అలాంటి అందం జస్ట్ కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవటం ద్వారా మీ సొంతం చేసుకోవచ్చు. ఆ పండ్లు ఏంటో మనం కూడా తెలుసుకుందాం.

 నీళ్లు

అవును మంచి నీళ్లు తాగటం ద్వారా అందానికి పెంచుకోవచ్చు. చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు యాక్టివ్ గా ఉండటానికి నీళ్లు ఉపయోగపడతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలంటూ డాక్టర్లు సూచిస్తారు. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగితే నిగనిగలాడుతూ కనిపిస్తారు. అందుకే ఫ్రీ గా వచ్చే నీటిని వీలైనంత ఎక్కువగా తాగండి.

పండ్లు, కూరగాయలు

కూరగాయలు, పండ్లతో అందానికి, ఆరోగ్యానికి రెండింటికి మంచిదే. ముఖ్యంగా కాలీప్లవర్, క్యాబేజీ, బ్రోకలీ తినాలి. వీటిలో మినరల్స్ తో పాటు ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. రక్త ప్రసరణ సరిగా జరిగి చర్మం కాంతివంతంగా మారటానికి ఇది ఉపయోగపడుతుంది. పండ్లలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. విటమిన్ సి తో పాటు అన్ని రకాల విటమిన్స్ కూరగాయలు, పండ్ల ద్వారా శరీరానికి అందుతాయి. విటమిన్ సి కారణంగా ప్రోటీన్స్ చర్మం సాగిపోకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది. విటమిన్ ఈ లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ కూడా ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి ఉపయోగపడతాయి.

నట్స్
నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ తీసుకోవటం ద్వారా అందాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. వీటిలో ఉండే మంచి కొవ్వు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం, విటమిన్ సి, సెలీనియం చర్మానికి మేలు చేస్తాయి. అందుకే  రోజుకు ఓ గుప్పెడు వాల్ నట్స్, ఖాజు, బాదం తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బెర్రీస్, అవకాడో

అవకాడో లో క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో లభించే విటమిన్ ఈ కారణంగా చర్మం ఎంతో నిగారింపుతో కనిపిస్తుంది. ప్రతి రోజు ఒక అవకాడో తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక బెర్రీస్. ఇవి కూడా అందాన్ని పెంచే ఫ్రూట్సే. ఇందులో విటమిన్ సి తో పాటు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. చర్మం సాగిపోకుండా ఉంచేందుకు బెర్రీస్ ఉపయోగపడతాయి. బ్లూ బెర్రీస్, క్రాన్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలా ఏదైనా బెర్రీస్ తీసుకోవటం హెల్త్ కు మంచిది.

రెడ్ వైన్, చాక్లెట్లు

ఆరోగ్యంగా కనిపించేందుకు చాలా మంది సినిమా వాళ్లు, సెలబ్రెటీలు రెడ్ వైన్ తీసుకుంటారు. ఇందులో ఉండే కాంపౌండ్స్ యవ్వనంగా ఉండేందుకు సాయపడతాయి. రోజు కాస్త రెడ్ వైన్ తాగటం ఆరోగ్యానికి మంచిదే. ఇక చాక్లెట్స్ కూడా. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్ గా అందం పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ ఇంకా మంచిది. మీ డైట్ లో దీన్ని చేర్చుకోవటంతో అందాన్ని మరింత పెంచుకోండి.

చేపలు

చేపలు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెంటల్ హెల్త్ కు మేలు చేస్తాయి. చేపల్లో ఉండే లీన్ ప్రోటీన్ ఉంటుంది. చేపల్లో ఉండే నూనె చర్మానికి మంచి చేస్తుంది. అందుకే చేపలు, మంచినీళ్లు, కూరగాయలు, పండ్లు అన్ని సమపాళ్లలో తీసుకుంటే చాలు. మీరు అందంగా మారిపోవచ్చు.