బరువు తగ్గాలంటే జస్ట్ ఈ కూరగాయలు, పండ్లు తినండి చాలు

అధిక బరువుతో సతమతమవుతున్నారా? ఎలాంటి డైట్ చేసిన, ఫుడ్ తీసుకున్న సరే మీ బరువు తగ్గటం లేదా?  ఐతే సింపుల్ గా కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను ట్రై చేయండి. ఈ పండ్లు, కూరగాయలు తింటే మీరు ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారు. ప్రతి రోజు మీ డైట్ లో వీటిని ఉండేలా ట్రై చేయండి.

పాలకూర

పాలకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది న్యూట్రియంట్స్, మినరల్స్ లతో కూడిన ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా ఐరన్ తో పాటు, విటమిన్ ఏ, విటమిన్ సీ, పొటాషియమ్, విటమిన్ కె ఉంటుంది. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది. దాదాపు ఏడాదంతా పాలకూర అందుబాటులోనే ఉంటుంది. కనుక వారంలో రెండు, మూడు రోజులైనా సరే పాలకూర తినాలని డాక్టర్లు చెబుతున్నారు.

క్యాప్సికం

మీరు బరువు తగ్గాలంటే మీ డైట్ లో ఉండాల్సిన ప్రధానమైన వెజిటేబుల్ ఏదైనా ఉండాలంటే అది కచ్చితంగా క్యాప్సికం. ఇందులో ఫ్యాట్, క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆరెంజ్ లో కన్నా కూడా ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సీ విటమిన్ ఫ్యాట్ ను కరిగించటంలో ఎంతో మేలు చేస్తుంది.

బ్రాకోలి

బ్రాకోలి వెజిటేబుల్ కూడా వెయిట్ లాస్ చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో పైబర్ తో పాటు చాలా రకాల న్యూట్రిషియన్స్, మినరల్స్ ఉంటాయి. దీనికి తోడు కాల్పియం, ఫాస్పరస్, జింక్, ఫోటాషియం వంటివన్నీ బ్రాకోలి లో పుష్కలంగా లభిస్తాయి. అందుకే బ్రాకోలి బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గ్రీన్ పీస్

గ్రీన్ పీస్ కూడా బరువు తగ్గించటంలో కీలకం. ఇందులో పోటాషియం, విటమిన్ సీ, విటమిన్ బీ6, మెగ్నేషియం, ఐరన్ వంటి న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఇవి మీరు ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత మీ బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇవ్వటంతో పాటు వెయిట్ లాస్ కు కూడా ఉపయోగపడతాయి.

క్యాబేజి

క్యాబేజి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల విరివిగా దీన్ని వాడుతుంటారు. వెయిట్ లాస్ కు క్యాబేజీ ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. ఇక ఇందులో ఉండే న్యూట్రియంట్స్ క్యాన్సర్ కారకాల నుంచి కూడా మనల్ని కాపాడాతాయి.

బెర్రీ పండ్లు

అవును బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రిస్ ఇలా అన్ని రకాల బెర్రి పండ్లు వెయిట్ లాస్ కు మంచి టానిక్ లే. తీపి ఎక్కువగా తినే వారు వీటిని ఎక్కువ ఇష్టపడుతారు. ఇందులో పుష్కలమైన విటమిన్ సీ తో పాటు మాంగనీస్, విటమిన్ కె, మినరల్స్ ఉంటాయి.

ఆమ్ల ఫలాలు

పులుపు, వగరు ఉండే అన్ని రకాల పండ్లు కూడా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. ఆరెంజ్, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవటం కారణంగా ఆరోగ్యంతో పాటు యాక్టివ్ నెస్ ఎక్కువగా ఉంటుంది.

యాపిల్

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా రోజుకు ఒక యాపిల్ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో రిచ్ న్యూట్రిషియన్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువే. పోటాషియం, విటమిన్ సి, మెగ్నిషియం కావాల్సినంత యాపిల్ లో ఉంటుంది. అందుకే వెయిట్ లాస్ కావాలనుకునే వారు యాపిల్ ను తమ డైట్ లో ఉంచుకోవాల్సిందే.

కివి ఫ్రూట్స్

వీటిని ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వాడుతున్నారు. రిచ్ న్యూట్రిషియన్స్, మినరల్స్ కివి ఫ్రూట్ లో ఉంటాయి. దీనికి తోడు విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి. ఇందులో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుందని నిరూపితమైంది.

బొప్పాయి

బొప్పాయి బాడీలో హీట్ ను పెంచుతుంది. బాడీలో హీట్ ఎక్కువగా ఉంటే ఫ్యాట్ ఎక్కువగా బర్న్ అవుతుంది. అదే విధంగా ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మెటబాలిజమ్ కు మేలు చేస్తాయి. దీని ద్వారా త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

వెయిట్ లాస్ కావాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూనే వారి డైట్ లో ఈ కూరగాయలను, ఫ్రూట్స్ ను చేర్చుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు.