ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీ - TNews Telugu

ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీఇంటర్ సెకండియర్ ఫలితాలు మరికొన్ని రోజుల్లో రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత వెంటనే సంపాదన మొదలు పెట్టేందుకు అనువైన కొన్ని స్వల్పకాలిక కోర్సులు కొన్ని ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు  ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్ లో వీటిని చేసేయొచ్చు. కొన్ని సంస్థలు వీటిని ఉచితంగా కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఆ కోర్సుల గురించి తెలుసుకుందాం..

వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా

3 నుంచి 9 నెలల వ్యవధి ఉండే వెబ్ డిజైనింగ్ డిప్లొమా కోర్సును ఇంటర్, గ్రాడ్యూయెట్స్ చేయవచ్చు. ఈ కోర్సు సక్సెస్ గా పూర్తి చేసిన వారికి వెబ్ డిజైనర్, డిజైనర్ ఎగ్జిక్యూటివ్, డిజైనింగ్ మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా

ఈ కోర్సు 6 నెలల నుంచి 1 సంవత్సరం వ్యవధి ఉంటుంది. ఇది కాకుండా 2 సంవత్సరాల అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కూడా చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత చెఫ్, రిసెప్షనిస్ట్, రూమ్ సర్వీస్ స్టాఫ్, మేనేజర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు.

మల్టీమీడియాలో డిప్లొమా

మల్టీమీడియాలో డిప్లొమా కోర్సు.. 6 నెలల నుంచి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు (అడ్వాన్స్డ్) ఉన్నాయి. ఈ కోర్సు చేసిన తర్వాత యానిమేటర్, గ్రాఫిక్ డిజైనర్, బ్రాండ్ మేనేజర్, ప్రమోషన్ మేనేజర్ ఉద్యోగాలు పొందవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ డిప్లొమా

ఇంటర్ పాస్ లేదా గ్రాడ్యుయేట్స్ కూడా ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సు 3 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. ఈ కోర్సు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్, మేనేజర్, స్పెషలిస్ట్ మార్కెటర్‌గా మంచి ఉద్యోగాలు పొందుతారు.

ఫోటోగ్రఫీలో డిప్లొమా

ఫోటోగ్రఫీలో స్వల్పకాలిక కోర్సు లేదా ఇది గరిష్టంగా 6 నెలల కోర్సు ఉంటుంది. ఈ కోర్సు చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, న్యూస్ ఫోటోగ్రాఫర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు.