ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో దొలవీర.. యునెస్కో ప్రకటన - TNews Telugu

ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో దొలవీర.. యునెస్కో ప్రకటనభారత దేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. ప్రపంచ వ్యప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతాలు భారత దేశ గొప్పతన్నాన్ని చాటిచెబుతాయి. అయితే తాజాగా భారత రాష్ట్రం గుజరాత్ లోని దొలవీర ప్రాంతాన్ని యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద జాబితాలో చేర్చింది. హ‌ర‌ప్పా నాగ‌రిక‌త‌కు ధోల‌విర న‌గ‌రం ఓ గుర్తుగా నిలుస్తుంది. ధోల‌విరకు వ‌ర‌ల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు ద‌క్కిన విష‌యాన్ని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా తెలిపారు. దోల‌విరా ఇప్పుడు భార‌త్లో‌ 40వ వార‌స‌త్వ సంప‌ద‌గా నిలుస్తుంద‌ని మంత్రి తెలిపారు. వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్ల‌లో ఇండియా సూప‌ర్‌-40 క్ల‌బ్‌లో చేరింద‌ని మంత్రి వెల్ల‌డించారు.