డోలో 650.. ఇప్పుడిదే నేషనల్ టాబ్లెట్

Dolo 650

జ్వరం వచ్చిందా..డోలో ఉందిగా. బాడిపెయిన్స్ ఉన్నాయా.. డోలో 650 వేసుకో. గొంతులో నొప్పి ఉందా.. మెడికల్ షాప్ కెళ్లి డోలో తెచ్చి వేసుకుంటే సరిపొతుంది. కరోనా పాండమిక్ సమయంలో ఎవరి నోట విన్నా డోలో-650 మాటే.

కోవిడ్-19 వ్యాక్సిన్‌ల వెనుక ఉన్న కంపెనీలైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాల, భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లాకు ఈ పాండమిక్ ఎంత గౌరవం తెచ్చిందో.. అంతే గౌరవం వచ్చింది డోలో-650 టాబ్లెట్ తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సురానాకు.

డోలో-650ని మైక్రో ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తోంది.  సురానా 30 ఏళ్ల ఫార్మా అనుభవజ్ఞుడు, 1983లో అతను కుటుంబ ఫార్మా బిజినెస్ లోకి వచ్చాడు. మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను డోలో-650 జనాదరణకు గల కారణాలు, 2022 కోసం కంపెనీ ప్రణాళికల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే..

Dolo 650 తయారీ ఆలోచన

“పారాసెటమాల్ 500 mg కి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఆ టైంలో పారాసెటమాల్ ఫార్ములాతోనే మరో ట్యాబ్లెట్ ఎందుకు అన్న ప్రశ్న వచ్చింది. అందుకే 500 ఎం.జీ కన్నా మెరుగైన ఫలితాలను ఇచ్చే ఇంకో ట్యాబ్లెట్ కు మార్కెట్ లో స్పేస్ ఉంది. తీవ్రమైన జ్వరం తరువాత వచ్చే మెడికల్ కాంప్లికేషన్స్ ను సరిగ్గా డీల్ చేసే మెడిసిన్ మన దగ్గర లేదు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని డోలో 650 కి ప్లాన్ చేశాము. మినిమం సైడ్ ఎఫెక్ట్ తో ఎక్కువ కాలం మార్కెట్ లో ఉండాలన్న టార్గెట్ తో డోలో-650ని 1993లో తీసుకొచ్చాం. చాలా రీసెర్చ్ చేసి ఇండియాలో తొలిసారిగా అండాకారంలో  టాబ్లెట్‌ ను తీసుకొచ్చి విజయం సాధించాం”.

కోవిడ్ కాలంలో పాపులారిటీకి కారణం

పారాసెటమాల్ 650 mg సెగ్మెంట్ లో డోలో 650 దశాబ్దాలుగా ఇండియాలో మొదటి స్థానంలో ఉంది. జ్వరం, ఒళ్లునొప్పులతో ఎవరైనా పేషెంట్ వస్తే డాక్టర్లు ప్రిస్కైబ్ చేసే మొదటి బ్రాండ్ మాదే. ఈ ట్యాబ్లెట్ ను తయారుచేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము సరైనా మార్కెటింగ్ కూడా చేయలేదు. సెలబ్రిటీలతో ప్రచారం కూడా చేయించలేదు. కానీ కరోనా పాండమిక్ టైంలో ప్రజలు డోలో ను ఎంతగానే నమ్మారు. ఒక్కటి మాత్రం నిజం డోలో అమ్మకాలు ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం మేము ఎన్నడూ ఊహించలేదు.

కోవిడ్ ప్రధాన లక్షణాలైన జ్వరం, ఒళ్లు నొప్పులను తగ్గించడమే డోలో 650 జనాదరణకు ముఖ్య కారణమని అనుకుంటాను. మౌత్ పబ్లిసిటీతోనే మా ట్యాబ్లెట్ దేశంలోని ప్రతీ ఇంటికి చేరింది. ఇక ముమ్మరంగా సాగిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా డోలో 650 సేల్స్ పెరగడానికి సహాయపడింది. వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం వస్తే డోలో వేసుకోవచ్చలే అని అనుకునేంతగా మా బ్రాండ్  జనాల్లోకి చొచ్చుకుపోయింది.

2022లో ప్రణాళికలు

ఇండియన్ మార్కెట్ లో వచ్చిన ఈ సక్సెస్ తో ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ మార్కెట్ పై దృష్టి పెట్టాము. అమెరికా, యూరప్ తో పాటు మిగతా మార్కెట్లలోనూ డోలో 650 ను ప్రవేశపెట్టే ఆలోచనలు ఉన్నాయి. తయారీతో పాటు సప్లై, మార్కెటింగ్ లో వస్తున్న టెక్నికల్ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ మా యాక్షన్ ప్లాన్ ను ప్రిపేర్ చేసుకుంటున్నాము.

IPO కు వెళ్లడంపై..

ఇప్పటివరకు మాకు కావాల్సిన నిధులను మేమే సొంతంగా సమకూర్చుకున్నాము. ఐ.పి.ఓ కు వెళ్లడంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. సరైన టైంలో ఐ.పి.ఓ పై మాట్లాడుతాం.