గాడిద పాలకు భలే డిమాండ్.. లీటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు!

Donkey Milk Gets Huge demand Per Litter rs.10,000
Donkey Milk Gets Huge demand Per Litter rs.10,000

ఆవుపాలు, బర్రె పాలు లీటర్ ధర ఎంత అంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కానీ.. గాడిద పాలు లీటర్ ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. జండూబామ్ సీసెడు అయితే రూ.100 అని మాత్రం చెప్తారు. ఇంతకీ జండూబామ్ సీసలో ఎన్ని పాలు పడుతాయో తెలుసా? జస్ట్.. 10 మిల్లీ లీటరు మాత్రమే. అవును.. దేశంలో గాడిద పాలకు మస్తు డిమాండ్ ఉంది. లీటరు గాడిద పాలు రూ.10 వేలకు అమ్ముతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఓ గాడిదను పట్టుకొని తిరుగుతూ ఈ పాలు అమ్ముతుంటారు.

Donkey Milk Gets Huge demand Per Litter rs.10,000
Donkey Milk Gets Huge demand Per Litter rs.10,000

చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలున్నా, శ్వాస సంబంధ సమస్యలున్నా గాడిద పాలతో తగ్గిపోతాయి. వీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా దొరకవు కూడా. అందుకే గాడిద పాలకు ఫుల్ డిమాండ్. ఎవరైనా పాలకోసం ఆవునో, బర్రెనో పెంచుకుంటారు. గాడిదను పెంచుకోడానికి ఎవరూ ఆసక్తి చూపరు. ఈ కారణం కూడా గాడిద పాలకు ఈ రేంజ్ లో డిమాండ్ ఉండటానికి కూడా ఒక కారణం.
గాడిద పాలలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు సైంటిస్టులు. జన్యుపరమైన, వైరస్ సంబంధిత సమస్యలకు గాడిద పాలు బాగా పనిచేస్తాయట. గాడిద పాలను తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్, టీబీ తదితర వ్యాధుల నివారణలో గాడిదపాలు ఉపకరిస్తాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు గాడిద పాలతో ఔషధాలే కాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు. కేరళ, మహారాష్ట్రలలో గాడిద పాలలో ఉండే ఔషధ గుణాల గురించి..ఆ పాల వల్ల ఉపయోగాల గురించి నిర్వహించిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇవ్వటంతో గాడిద పాలకు డిమాండ్ బాగా పెరిగింది. కేరళలోని కోచికి చెందిన ఏబీ బేబీ అనే కంపెనీ గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేసి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇలా చేయడం వల్ల ఏడాదికి రూ. 20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. పరిశోధనలు చేసి.. వాటి ద్వావా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని తెలిసిన తర్వాతనే గాడిద పాలతో కాస్మోటిక్స్ తయారు చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. గాడిద పాలతో తయారు చేసే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అంతే కాదు వీటికి చాలా ఖరీదుకూడా ఎక్కువే… గాడిద పాలను సబ్బులు, లిప్ బా‌మ్‌లు, బాడీ లోషన్లు తదితర వాటిని తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు.

Donkey Milk Gets Huge demand Per Litter rs.10,000
Donkey Milk Gets Huge demand Per Litter rs.10,000

గాడిద పాల‌లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో సబ్బులను త‌యారు చేసి అమ్ముతూ.. అతి తక్కువ కాలంలో లాభాల బాట పట్టింది. ఈజిప్టును పాలించిన రాణి క్లియో పాత్ర తన అందాన్ని కాపాడుకోవడానికి గాడిద పాల‌తోనే స్నానం చేసేద‌ట‌. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. ఇలా గాడిద పాల‌ను స్నానానికి ఉప‌యోగిస్తే చ‌ర్మం మృదువుగా మారుతుంద‌ని, చ‌ర్మ సంర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న ఆర్గానికో అనే కంపెనీ సబ్బులను తయారు చేసింది. గాడిద పాలు లో ఫ్యాట్ ఫుడ్ అని అంటున్నారు. మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ దీని సొంతమని ఐక్య రాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆరనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్‌ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసి పిల్లలకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్‌.