ఈఫిల్ టవర్ ను రాత్రిపూట ఫొటో తీయొద్దా.. అలా చేస్తే ఏం జరుగుతుందంటే - TNews Telugu

ఈఫిల్ టవర్ ను రాత్రిపూట ఫొటో తీయొద్దా.. అలా చేస్తే ఏం జరుగుతుందంటేDon't take Eiffel Tower Photos at Night
Don’t take Eiffel Tower Photos at Night

ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. పారిస్ లోని ఈ నిర్మాణాన్ని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తారు. దగ్గరగా వెళ్లి అంతెత్తు కట్టడాన్ని చూసి ఆశ్చర్యపోయి.. దూరం నుంచి చూసి ఎంత బాగుందో అంటూ ఆనంద పడతారు. అయితే.. చాలామంది పర్యాటకులు సాయంత్రం సమయంలోనే ఈఫిల్ టవర్ చూడటానికి వెళ్తారు. రాత్రిపూట లైట్ల వెలుగులో మెరుస్తూ.. బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆకట్టుకుంటుంది. ఈ టవర్ వల్లనే పారిస్ ను సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు. అయితే.. రాత్రి సమయంలో ఈఫిల్ టవర్ ను చూసేటప్పుడు ఒక్క విషయం మరిచిపోవద్దు. రాత్రి లైట్ల వెలుగులో ఈఫిల్ టవర్ ను ఎంతసేపు చూసినా ఏం కాదు. కానీ.. ఫొటో తీశారో మీ పని ఖతం.

Don't take Eiffel Tower Photos at Night
Don’t take Eiffel Tower Photos at Night

యూరోపియన్ కాపీరైట్ లా ప్రకారం రాత్రి సమయంలో ఈఫిల్ టవర్ ను ఫొటో తీయకూడదు. రాత్రిపూట ఈఫిల్ టవర్ మీద పడే లైట్లకు కాపీరైట్స్ ఉన్నాయి. ఆ లైట్ల వెలుగులో అందంగా మెరిసిపోతున్న ఈఫిల్ టవర్ ను ఫొటో తీస్తే.. కాపీరైట్ చట్టం ప్రకారం శిక్ష తప్పదు. అందుకే.. ఇప్పటి వరకు ఈఫిల్ టవర్ లైటింగ్ వీడియోలు, ఫొటోలు వేరే వ్యక్తులెవరూ పోస్ట్ చేయలేదు.. చేయలేరు కూడా. టవర్ ఫొటోలు, వీడియో హక్కులన్నీ దాన్ని నిర్మించిన వారికే ఉన్నాయి. ఫ్రాన్స్ దేశపు చట్టాల ప్రకారం.. ఈఫిల్ టవర్ వంటి స్మారక చిహ్నాలపై కాపీరైట్ 70 ఏళ్లకు పైగా ఉంటుంది.

Don't take Eiffel Tower Photos at Night
Don’t take Eiffel Tower Photos at Night

ఈఫిల్ టవర్ ని సృష్టించిన గుస్తావ్ ఈఫిల్ 1923లో చనిపోయాడు. ఆ తర్వాత ఈ టవర్ 1993లో ఈఫిల్ టవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పగటి పూట తీసే ఫొటోలపై ఎలాంటి కాపీరైట్ ఉండదు. అయితే.. 1985 నుంచి ఈఫిల్ టవర్ మీద సాయంత్రం సమయంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం లైట్లు వెలిగినప్పటి నుంచి ఉదయం లైట్లు ఆర్పే వరకు లైటింగ్ ఈఫిల్ టవర్ ని ఎవరూ ఫొటో తీయకూడదు. చాలామంది ఈ విషయం తెలియక లైటింగ్ సమయంలో ఫొటోలు తీసి చిక్కుల్లో పడ్డారు. అయితే.. ఒక్క అవకాశం ఉంది. రాత్రి లైటింగ్ సమయంలో ఈఫిల్ టవర్ దగ్గర ఫొటోలు తీయాలంటే కొంత డబ్బులు చెల్లించాలి. అలా అయితే.. కాపీరైట్ చట్టం వర్తించదు.