కోచింగ్ లో ద్రవిడ్‌ కొత్త ట్రెండ్.. వీడియో

Rahul Dravid

ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా దానికి బదులు తీర్చుకోవాలని చూస్తుంది. రహానే సారధ్యంలోని టీమిండియా జట్టు కొత్తగా కనిపిస్తుంది. కోహ్లి, రోహిత్‌, షమీ, బుమ్రా లాంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగనుంది.

నవంబర్‌ 25 నుంచి న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు జరగనున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది. ఈ సందర్భంగా ద్రవిడ్.. స్పిన్నర్‌ అవతారమెత్తి బ్యాట్స్ మెన్‌కు వైవిధ్యమైన బంతులు వేశాడు. టీమిండియా కోచ్‌గా కాస్త కఠినంగా కనిపించే రాహుల్ ద్రవిడ్‌.. గ్రౌండ్ లోనూ అంతే క్రమశిక్షణతో ఉంటాడు.