రూ.686 కోట్ల విలువైన నిషేధిత మందుల పట్టివేత

Drugs worth over Rs 680 cr seized from UP village on Indo-Nepal border; 1 held

Drugs worth over Rs 680 cr seized from UP village on Indo-Nepal border; 1 held

భారత్-నేపాల్ సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మందుల రవాణాను పోలీసులు ఛేదించారు.  ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్‌గంజ్​ జిల్లాలోని ఓ గ్రామంలో నిల్వచేసిన రూ.686 కోట్ల విలువైన నిషేధిత మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషలో రమేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు గోవింద్ గుప్తా కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్​లో 104 ఇంజెక్షన్లు, 18,782 టానిక్ బాటిళ్లు, 3,13,384 క్యాప్సూల్స్, 1,24,897 టాబ్లెట్‌లతో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.