ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదు

earthquake

ఆదివారం తెల్లవారుజామున 5:17 నిమిషాలకు ఇండోనేషియాలోని టోబేలో అనే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. టోబేలోకు 259 కి.మీ దూరంలో ఉందని యూఎస్జీఎస్ తెలిపింది. భూ అంతర్భాగంలో 174.3 కి.మీ లోతులో ప్రకంపణలు వచ్చాయని.. భూకంపం వల్ల జరిగిన నష్టం వివరాలు ఇంకా లేదని అధికారులు తెలిపారు.