మిజోరంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ మీద 6.1గా నమోదు

శుక్రవారం తెల్లవారుజామున 5:15 నిమిషాలకు మిజోరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ సిస్మోలజి (ఎన్సీఎస్) తెలిపింది. మిజోరంలోని థెంజాల్ కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

earthquake
భారత్ – మయన్మార్ సరిహద్దుల్లో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. మిజోరంతోపాటు త్రిపుర, మణిపూర్, అసోంతో, కలకత్తాలో కూడా భూప్రకంపణలు సంభవించాయి. ఈ తీవ్రత 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్ లోని చిట్టాగాంగ్ కి 183 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.